పెళ్లి పీటలపై పబ్ జీ ఆడిన వరుడు

పెళ్లంటే ఎంత హంగామా ఉంటుంది. సందడి సందడిగా ఉంటుంది. ఆటపాటలు, మంత్రాలు సరదాసరదాగా అయిపోతుంది. అదయ్యాక బంధువులు క్యూ కట్టి అక్షింతలేసి దీవించి గిఫ్టులిస్తుంటారు. పాపం అవన్నీ చూసే సరికి, తాళి కట్టే సరికి ఈ పెళ్లి కొడుకుకు బోర్​ కొట్టిందో ఏమో ఫోన్​ తీసి పబ్​ జీ ఆడేశాడు. పక్కన పెళ్లి కూతురు మొహం మాడ్చుకుని చూస్తుండి పోయిందే తప్ప ఏమీ అనలేదు. అయినా అతడు తల తిప్పి చూస్తేనా! పైగా బంధువో, స్నేహితుడో ఎవరో తెలియదుగానీ, గిఫ్టు ఇస్తుంటే పక్కకు తోసేశాడు. పెద్ద సౌండుతో పాటలు పెట్టినా మనోడి మైండ్​ డైవర్ట్​ అయితే ఒట్టు. అంతలా పబ్​జీపై మోజు పెంచుకున్నట్టున్నాడు. పెళ్లి కూతురు కూడా తానేం చేసేది అన్నట్టు ఆ వీడియోగేమ్​ వైపే అలా చూస్తూ ఉండిపోయింది. ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. టిక్​టాక్​లో హల్​చల్​ చేసిన వీడియో ఫేస్​బుక్‌కూ ఎక్కేసింది. దాదాపు 4.9 లక్షల మంది దాన్ని చూశారు. కుర్రకారు మైండ్లోకి పబ్​జీ ఎంతలా ఎక్కేసిందో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. ఇప్పటికే గుజరాత్​లో దానిని బ్యాన్​ చేశారు. నేపాల్​లోనూ ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశంతో నిషేధం విధించారు.

 

Latest Updates