ప‌బ్‌జి ని వెంట‌నే బ్యాన్ చేయాలి

“PUBG should be ban” : Child rights protection president achyuta rao Demand

యువత పబ్‌జి గేమ్‌కు బానిసవుతుంది. పగలు,రాత్రి తేడా లేకుండా పబ్‌జి గేమ్ ఆడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పబ్‌జి వ్యసనం ప్రాణాలను కూడా తీస్తూ.. ఎందరో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతుంది. పిల్లల ప్రాణాల సైతం హరిస్తున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్ రావు డిమాండ్ చేశారు.

ఇటీవల హైద్రాబాద్ మల్కాజిగిరి విష్ణుపురి కాలానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సాంబశివను ఎక్కువ సమయం మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నాడని తల్లిదండ్రులు మండలించడంతో… ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఇదే విషయంపై కేంద్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. తక్షణమే ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని కేంద్ర శిశు సంక్షేమ కార్యదర్శి… అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. వీలైనంత వరకు ఫోన్లకు ,ఇంటర్ నెట్ కు తల్లిదండ్రులు పిల్లలను దూరంగా ఉంచాలని … ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించకుండా సున్నితంగా మందలించాలని అచ్యుత్ రావు కోరారు.

Latest Updates