దిశ నిందితుల ఎన్ కౌంటర్ : పోలీసులపై పూల వర్షం కురిపించిన ప్రజలు

ఎన్ కౌంటర్ వార్తతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మృగాళ్ల చేతిలో బలైన దిశకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద దిశను హత్య చేసిన ప్రాంతంలో..నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కేసును రీకన్ స్ట్రక్టన్ చేసేందుకు నలుగురు నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయం కావడంతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు ఈ నలుగురు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడితో అప్రమత్తమైన పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో నిందితులు మృతి చెందారు.
ఎన్ కౌంటర్ వార్త తెలుసుకున్న ప్రజలు చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు చేరుకున్నారు. దిశా పాశవిక అత్యాచార హత్యకు చరమగీతం….
తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపిన తెలంగాణ వీరత్వం..ఇదీ.. కామాంధుల పాలిట దడ పుట్టించిన సామాజిక న్యాయం..జై పోలిసన్న అంటూ.. ప్రజల జన గర్జనలు మిన్నంటుతున్నయి..అమరహై దిశా అంటూ గట్టిగా గర్జిస్తున్నాయి. పాశవిక హత్యలో దిశకుటుంబానికి న్యాయం చేసిన పోలీసులకు పూలవర్షం కురిపించారు.

Latest Updates