పండుగ షాపింగ్‌కి నో ఇంట్రెస్ట్

పండుగ బిజినెస్​కి ఆన్‌లైన్ మీదే ఆశలు

ఆఫ్‌లైన్ షాపింగ్‌కి సిటిజన్స్ నో ఇంట్రెస్ట్

ఈ – కామర్స్ సైట్లతో షోరూమ్స్, షాపుల టైఅప్
సేల్స్ పెంచుకునేలా ఏర్పాట్లు
థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌మెంట్‌
10 వేల మందికి ఉపాధి అవకాశాలు

హైదరాబాద్, వెలుగు: సిటీ మార్కెట్లపై కరోనా తీవ్ర ఎఫెక్ట్‌ చూపింది. ఒకప్పటిలా ఏ వ్యాపారమూ సాగడం లేదు. అన్‌లాన్‌ 4 అమల్లోకి వచ్చి మూడు వారాలవుతున్నా క్లాత్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫుట్‌వేర్‌, హోం అప్లయనెస్స్ కొనేందుకు ఎవరూ పెద్దగా వెళ్లడం లేదు. డిస్కౌంట్లు, స్టాక్ క్లియరెన్స్ సేల్స్ పేరిట హడావుడి చేస్తున్నా ఫలితం లేకపోవడంతో బ్రాండెడ్ షోరూమ్స్ నుంచి చిన్న వ్యాపారుల వరకు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు దసరా సీజన్ సమీపిస్తుండడంతో ఆన్ లైన్ మార్కెటింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ– కామర్స్ సంస్థలతో టైఅప్ అయ్యి సేల్స్​పై ఆశలు పెట్టుకుంటున్నారు.

ఆన్‌లైన్ సేల్స్ పై ఫోకస్

లాక్‌డౌన్‌  టైమ్‌లో ఆన్ లైన్ సేల్స్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్టలు, గ్రోసరీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫుట్‌వేర్‌ ఇలా.. ఏది కావాలన్నా శివారు ప్రాంతాలకూ డోర్ డెలివరీ చాన్స్ ఉండడంతో ఎక్కువమంది ఆ వైపు మొగ్గు చూపారు. గతంతో చూస్తే ఈ 6 నెలల్లో సిటీలో ఆన్ లైన్ సేల్స్  30 శాతం మేర పడిపోయినా డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కరోనా భయంతో జనం షోరూమ్‌లు, షాపులకు వెళ్లి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అవసరమైన వస్తువులు, సరుకులను ఆన్ లైన్ లో తెప్పించుకుంటున్నారు. దాంతో వ్యాపారులూ రూట్ మార్చి ఆన్‌లైన్‌ సేల్స్​పై ఫోకస్ పెట్టారు.

స్టాక్ అమ్ముకునేందుకు..

సిటీలో గిరాకీ లేక డీలా పడ్డ షోరూమ్‌లు, షాపుల నిర్వాహకులతో ఈ –కామర్స్ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. బట్టలు, ఫుట్‌వేర్‌, ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌ ఎమ్మార్పీ కంటే 15 నుంచి 50 శాతం  వరకు ఆఫర్‌తో సేల్ చేసేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఏటా నిర్వహించే ఫెస్టివల్ క్లియరెన్స్ సేల్స్ తరహాలోనే ఉన్న స్టాక్‌ను ఆన్ లైన్ లో అమ్మేలా వ్యాపారులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బ్రాండెడ్ షోరూమ్‌లకు ఓన్ వెబ్ సైట్లు ఉన్నా వాటి ద్వారా సేల్స్ తక్కువగానే ఉంటున్నాయి. ఏటా ఒక్కో షోరూమ్ ఆన్ లైన్ బిజినెస్ రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు మాత్రమే ఉంటోంది. ప్రస్తుతం అంత పరిస్థితి కూడా లేదు. దాంతో డిస్కౌంట్ ఆఫర్లతో ఆన్‌లైన్‌ కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. స్మాల్, మీడియం స్కేల్ వ్యాపారులను డిజిటల్ మార్కెట్ లోకి తీసుకొచ్చేలా ఈ– కామర్స్ సంస్థలు కూడా అఫిలియేటివ్, సెల్లర్ బిజినెస్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

రిక్రూట్‌మెంట్‌ ఏర్పాట్లు

కరోనా పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు డిమాండ్ ఉంటుందని భావించి ఈ– కామర్స్ సంస్థలు సీజన్ కు తగ్గట్టు డెలివరీ, ప్యాకింగ్, ఫుల్ ఫిల్ మెంట్ సిబ్బంది నియామకాలు చేపడుతున్నాయి. థర్డ్ పార్టీ సంస్థలు రిక్రూట్ మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టాయి. సిటీలో రానున్న నెల రోజుల్లో 10వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఈ– కామర్స్ సంస్థలకు మ్యాన్ పవర్ సప్లయ్ చేసే ఏజెన్సీ నిర్వాహకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, పేటీఎం వంటి సంస్థలకు డెలివరీ సేవలు అందించే వారి సంఖ్య 28వేలు ఉండగా, వారి సంఖ్య 40వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

రెండు విధాలా ఉపయోగం

కరోనా భయంతో షాపింగ్ కి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది. స్టాక్ నిల్వ ఉంచడం కంటే మార్కెట్ ట్రెండ్ కు తగ్గట్టు ఆన్ లైన్ లో అమ్మడం బెటర్ అనుకున్నా. అలా ఉన్న స్టాక్ సేల్‌ చేసేందుకు ఈ – కామర్స్ సైట్లతో టై అప్ అయ్యా. స్టాక్ ఎలాగూ షాపులోనే ఉంటుంది. ఆన్ లైన్ ఆర్డర్ వస్తే తీసుకుంటాం. దాంతో రెండు విధాలా ఉపయోగం.

– జయకృష్ణ, హోల్ సేల్ వ్యాపారి, హిమాయత్ నగర్

For More News..

అసైన్డ్ భూములు దర్జాగా అమ్మి పత్తాలేకుండా పోయిన లీడర్లు, రియల్టర్లు

వీడియో: ఒక కాలు లేకున్నా.. ఒంటికాలుతో పొలం పనులు

ఓపెనింగ్ చేయక ముందే కొట్టుకుపోయిన బ్రిడ్జీ

Latest Updates