కరెంట్ చార్జీలు పెరిగితే భరించాలే

కరెంట్ చార్జీలు, ట్యాక్సులు పెంచుతం
ధైర్యంగా చెప్తం.. చార్జీలు పెరిగితే భరించాలే: సీఎం కేసీఆర్
ఓట్ల కోసం మేం భయపడం
మాపై నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు ఓట్లు వేశారు
ట్యాక్సులు వసూలు చేయకుంటే సర్పంచ్, కార్యదర్శి పదవి పోతది
500 కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు స్పెషల్ గ్రాంట్
ఫొటోల కోసం చెట్లు నాటుడు కాదు.. పెట్టిన వాటిని బతికించాలె
గ్రామాలు శుభ్రంగా ఉండాలె.. కరోనా రావాలంటే గజగజ వణకాలె
పల్లె ప్రగతిపై చర్చకు సమాధానమిచ్చిన సీఎం

ఉపాసం ఉండైనా ఊర్లకు పైసలిస్తం
గ్రామాల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తం . ఒక పూట ఉపాసమైనా ఉంటం. పల్లెలకు పైసలిస్తం. పంచాయతీలు కూడా సొంత రెవెన్యూ పెంచుకోవాలె. వంద శాతం ట్యాక్సులు వసూలు చేయకుంటే సర్పంచ్‌ పదవి పోతది. సెక్రటరీ ఉద్యోగం ఊడుతది. అందరూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రయారిటీ ఇవ్వాలి. పరిశుభ్రం చేసుకోవాలె. కరోనా మన పల్లెలకు రావాలంటేనే గజగజ వణకాలె. గ్రామాల్లోనూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ విధానం తెస్తం. ఎవరూ వచ్చి ఇండ్లకు కొలతలు తీయరు. ఇంటి యజమానే తమకు ఇంత స్థలం ఉందని చెప్తూ ట్యాక్సులు కట్టాలె . తప్పుడు సమాచారమిస్తే 25 రెట్ల జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష పడ్తది. పంచాయతీల నిధులు పూర్తిస్థాయిలో పనుల కోసం వినియోగించుకునేలా చూస్తం.
– సీఎం కేసీఆర్

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘ఓట్ల కోసం భయపడం.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతం.. కరెంట్‌ బిల్లులు డెఫినెట్‌‌గా పెంచుతం, ప్రాపర్టీ ట్యాక్సులు పెంచుతం.. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నడిచేదే పన్నుల మీద. ఇందులో శషబిషలు ఎందుకు? ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు కరెంట్‌ ఫ్రీగా ఇస్తం. ఎవరైతే పే చేయగలుగుతారో వారికి పెంచుతం. మాకు ధైర్యం ఉంది. ప్రజలకు ధైర్యంగా చెప్తం. చార్జీలు పెరిగితే ప్రజలు వాటిని భరించాలి ..’’అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

పల్లెప్రగతిపై శుక్రవారం అసెం బ్లీలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఏది పడితే అది చెప్తే ఓట్లు పడవని కేసీఆర్ అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రూ.2 లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పిందని.. తాము రూ.లక్ష రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తమన్నామని.. తమకు క్రెడిబులిటీ ఉంది కాబట్టే ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. ‘‘కుండలో ఉన్నదేందో కుండబద్దలు కొట్టినట్టే చెప్తం. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఏదో చేయరు. మన పల్లెలు బాగుండాలంటే సర్పంచులే పనిచేయాలే..’’అని పేర్కొన్నారు.

పన్నులు వసూలు చేయకుంటే చర్యలు
పంచాయతీలు సొంత రెవెన్యూను పెంచుకోవాలని కేసీఆర్ సూచించారు. వంద శాతం ట్యాక్సులు వసూలు చేయకుంటే సర్పంచ్‌ పదవిపోతదని, సెక్రెటరీ ఉద్యోగం ఊడుతదని హెచ్చరించారు. ‘‘మున్సి‌పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు .. సర్పంచ్‌‌లు..ఎవరికైనా వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రేమ్‌
ఉంటుంది.. దానిని దాటితే పదవులు ఊడుతయి. ఇది నేను చెప్పడం కాదు చట్టంలోనే ఉంది. నేను ధైర్యంగా చెప్తున్నా.. 2019–20లో నాటిన మొక్కల్లో 86 శాతం బతికినయి. ఇంతకుముందు ఎందుకు బతకలేదంటే.. వాళ్లకు భయం లేదు కాబట్టి. ఇప్పుడు పనిచేయకపోతే పదవి పోతది కాబట్టి మొక్కలు దక్కినయి. పనిచేయకపోతే పదవులు ఎందుకు? జోకులు, ఫొటో ఐటమ్‌‌ల కోసం చెట్లు నాటుడు కాదు అని వాళ్లకర్థమైంది’’అని చెప్పారు.

కరోనా రావాలంటే గజగజ వణకాలే..
ఎవరూ వెయ్యేండ్లు బతకడానికి రాలేదని, అయ్యగారు కూడా శతమానం భవతి అనే దీవిస్తారని సీఎం అన్నారు. ‘‘అందరం పోయేవాళ్లమే. మరణించిన వాళ్లకు గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలె. రాష్ట్రంలో కుల, మత రహిత శ్మశాన, దహన వాటికలు సిద్ధమవుతున్నాయి. అన్ని పల్లెలు స్వచ్ఛతతో ఉండాలే. ఎక్కడైనా ఒక్క పోస్టు తక్కువగా ఉంటే వాటిని నింపుకొనేందుకు కలెక్టర్లకే అధికారాలు ఇచ్చినం. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసేందుకే అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారిని నియమించినం. అందరూ పల్లె, పట్టణ ప్రగతికి ప్రయారిటీ ఇవ్వాలి .. కరోనా మన పల్లెలకు రావాలంటేనే గజగజ వణకాలె..’’అని పేర్కొన్నారు. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం తీసుకు వస్తున్నట్టు చెప్పారు. ఎవరూ వచ్చి ఎవరి ఇండ్లకు కొలతలు తీయరని, ఇంటి యజమానే తమ స్థలం ఇంత ఉందని చెప్తూ ట్యాక్సులు కట్టాలని తెలిపారు. ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే 25 రెట్ల జరిమానాతో పాటు రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. గతంలో ఎవరు డబ్బులిస్తే వారికి, ఎక్కడ పడితే ఎక్కడ ఇండ్లు కట్టు కోవడానికి పర్మిషన్లు ఇచ్చారని, హైటెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ల కింద కూడా ఇండ్లు కట్టారని, లే ఔట్లు వేశారని, ఇలాంటి దురావస్థ పోవాలని పేర్కొన్నారు.

గాంధీ కన్నా ఎస్‌ కే డేనే ఎక్కువగా చేశారు
గ్రామాల గురించి మహాత్మాగాంధీ కన్నా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే డే ఎక్కువగా ఆలోచించారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎంచుకున్న అంశమే తప్పని అప్పటి ప్రధాని నెహ్రూకు ఆయన ధైర్యంగా చెప్పారని గుర్తు చేశారు. మూర్ఖుల పాలనలో ఉన్న ఇండియాకు వచ్చి తాను పనిచేయలేనని వ్యాఖ్యానించారని చెప్పారు. ఎస్కే డే సూచన మేరకే రెండో పంచవర్ష ప్రణాళికలో ఆహార భద్రత కోసం ప్రాజెక్టుల నిర్మాణాన్ని తీసుకున్నారన్నారు. నెహ్రూ తీసుకున్న విధాన నిర్ణయంతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే డే ఇండియాకు తిరిగి వచ్చి, కమ్యూ నిటీ డెవలప్‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారని వివరించారు. ఆయనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఏర్పాటు చేసి పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యమానికి రూపకల్పన చేశారని, దాని నుంచి సహకార ఉద్యమం కూడా వచ్చిందని చెప్పారు.

ఛత్తీస్‌ గఢ్‌ సీఎస్‌ ములుగు జిల్లా చెయ్య మన్నరు
గిరిజనులు, ఆదివాసీలకు ప్రత్యేక జీవన విధానం ఉంటుందని, అందుకే వారి కోసం 3 వేలకు పైచిలుకు పంచాయతీలు ఏర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు. ‘‘ములుగును జిల్లా చేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. అంతకుముందు అది భూపాలపల్లి జిల్లాలో ఉండె. ములుగు జిల్లా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నేను ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌ సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడితే ఆయన జిల్లా ఇచ్చేయండి సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని చెప్పిండు.

ఆ ఊర్లకు స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాంట్‌
రాష్ట్రంలో 500 మంది కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాలు 899 ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. వాటికి ఏటా ఐదు లక్షలకు తగ్గకుండా, ఐదేండ్లలో రూ.40 లక్షల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ట్రాక్టర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు ఇవ్వడం భారంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీఎం ఈ హామీలు ఇచ్చారు. 899 గ్రామాల్లో 500 జనాభా ఉన్నవి 20, 400–499 మధ్య ఉన్నవి 523, 300–399 మధ్య ఉన్నవి 292, 200–299 వరకు ఉన్నవి 54, 100–199 మధ్య జనాభా ఉన్నవి పది, 100 జనాభా ఉన్న ఒక గ్రామ పంచాయతీ ఉందని సీఎం తెలిపారు. వాటన్నింటికీ తోడ్పాటు ఇస్తామన్నారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం సాయంత్రమే జీవో జారీ చేసింది.

ఎర్రబెల్లి టాప్‌ పర్ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌రావు పనితీరులో టాప్‌ పర్ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచారని సీఎం కేసీఆర్ చెప్పారు. పల్లె ప్రగతి అమలు తీరు బాగుందన్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా దమ్మన్నపేటకి కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామిడి నర్సింహారెడ్డి రూ.25 కోట్ల విరాళమిచ్చారని, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని గట్ల నర్సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుండవరం భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు రూ.3 కోట్లు, నల్గొండ నియోజకవర్గంలో కంచర్ల కృష్ణారెడ్డి రూ.కోటి, కాపులకనపర్తి ఊరికి చెందిన ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ 6నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారని సీఎం చెప్పారు. జగిత్యాల నియోజకవర్గం హిమ్మత్‌ రావుపేటలో కోతులు ఊర్లోకి రాకుండా హరితహారం కింద మంకీ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టును ఏర్పాటు చేశారన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం కొత్తకారాయగూడెం గ్రామ పంచాయతీలో పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపించేలా శ్మశానవాటిక నిర్మించారని చెప్పిన సీఎం ఆ ఫొటోను సభలో చూపించారు. ఆ సర్పంచ్‌ శ్రీదేవిని అభినందించారు.

కఠినంగా ఉండాలనే ప్రొబేషన్​ నిబంధన
చిరుద్యోగులకు మంచి జీతాలే ఇస్తున్నామని, పంచాయతీల నుంచి ఎవరూ జీతాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. పంచాయతీ సెక్రెటరీలకు నెలకు రూ.15 వేల జీతమే పెట్టామని, మూడేండ్లు ప్రొబేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్ ఉందని, కఠినంగా ఉండాలనే అలా పెట్టామని చెప్పారు. అలా పెడితేనే ఈ మూడేండ్లలో గ్రామాల రూపు రేఖలు మారుతాయని అనుకున్నమన్నారు.

ఆ మున్సిపాలిటీలకు ఐటీడీఏ నిధులిస్తం
భద్రాచలం, సారపాక, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, అవి షెడ్యూల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఈ అంశాన్ని సభలో ప్రస్తావించగా సీఎం సమాధానమిచ్చారు. పాల్వంచ, మణుగూరు, మందమర్రిలో అభివృద్ధి పనులు చేసేందుకు ఐటీడీఏ నిధులు ఇస్తామని, తన వద్ద ఉన్న స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోంచి కొంత మొత్తం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

‘తండా’పంచాయతీల్లో రేషన్‌ షాపులు
తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని, వాటిలో త్వరలోనే రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుల ఏర్పాటుకు ఇప్పుడున్న నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉందని, దీనిపై ఇప్పటికే సంబంధిత మంత్రి, అధికారులతో చర్చించానని చెప్పారు. త్వరలో ఆ ప్రక్రియ మొదలు పెడతామన్నారు.

ఊర్ల రూపురేఖలు మారుస్తం
ఎస్‌‌‌‌‌‌‌‌కే డే స్ఫూర్తికి విరుద్ధంగా ఇన్నాళ్లూ పల్లెలు పనిచేశాయని, వాటి ఊపిరి పోగొట్టారని కేసీఆర్ కామెంట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రమేయాన్ని పెంచిందెవరో, ఆ పుణ్యాత్ములెవరో అందరికీ తెలుసన్నారు. గ్రామాలు పెంట కుప్పల్లా అయ్యాయని, బోర్లను పూడ్చే నాథుడే లేకుండా పోయారని, వాటిలో పిల్లలు పడితే కలెక్టర్లు పరుగెత్తే పరిస్థితి దాపురించిందని చెప్పారు. అలాంటి గ్రామాల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తామన్నారు. ‘‘15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని పంచాయతీలకు ఏడాదికి రూ.1,847 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అందులో మండల పరిషత్‌‌లకు 5 శాతం, జిల్లా పరిషత్‌‌లకు 10 శాతం కేటాయించాలని సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇస్తం. ఒక పూట ఉపాసమైనా ఉంటం.. శాసనసభ్యులకు నిధులు, ఆపైనా పల్లెలకు పైసలిస్తం..’’అని కేసీఆర్ చెప్పారు. రూ.4 వేల కోట్ల ఉపాధి హామీ నిధులను మొక్కల పెంపకానికి ఉపయోగించుకునే ఆస్కారం ఉందని, వాటిని పంచాయతీల ద్వారా ఖర్చు చేస్తామని భట్టి విక్రమార్క ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు.

Latest Updates