గోమూత్ర పార్టీ.. కరోనాను అరికట్టేందుకట!

Publicity-hungry swami drinks cow urine at Delhi party to piss off coronavirus

కాషాయ వస్త్రాలు, మెడలో దండలు, చేతిలో పానీయాలు.. ఇదంతా చూసి ఏదో స్వాములోరి మఠం అనుకుంటున్నారా? కానే కాదు. అక్కడున్న వారంతా గోమూత్ర పార్టీ కి హాజరైన వారు. అవును. ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ నివారణ గోమూత్రమే సరైన ఔషధమని ప్రచారం చేసేందుకు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా హిందు మహాసభ నిర్వాహకులు నిర్వహించిన ఈ పార్టీకి 200 మంది హాజరయ్యారు.

ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ గా హాజరైన స్వామి చక్రపాణి మహారాజ్‌.. పది చేతులు, సింహం తలతో నిప్పులు కక్కుతున్న కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రపటాన్ని గోమూత్రంతో కడిగేశాడు. ఆవు మూత్రం ద్వారా వైరస్ ని నివారించవచ్చనే విషయాన్ని అక్కడి ప్రజలకు ఈ విధంగా చేసి చూపాడు.

గోమూత్రం సేవించడం ద్వారా అన్ని రోగాలు మాయమవుతాయని, ఆ పార్టీకి వచ్చిన వారందరికీ గోమూత్రంతో పాటు, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.  దేశమంతటా వైరస్ పట్ల ఇలాంటి అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని సదరు సంఘ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

గోమూత్రం ద్వారా వ్యాధులు నయమవుతాయని చక్రపాణి మహారాజ్ ఒక్కరే కాదు. ఇంతకుముందు కూడా కొందరు ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియా గతంలో ఆవు మూత్రం, ఆవు పేడ ద్వారా కరోనా బాధితులకు చికిత్స చేయవచ్చని చెప్పి వార్తల్లో నిలిచారు. భోపాల్ ఎంపి ప్రగ్యా ఠాకూర్ కూడా క్యాన్సర్ వ్యాధిని గోమూత్రం నయం చేయగలదని చెప్పింది.

ఏదైతేనేం.. ఈ పార్టీకి  200 మంది హాజరై తీర్ధ ప్రసాదాలు.. అదే గోమూత్రం సేవించి వైరస్ ను అరికట్టే ప్రయత్నం చేశారు.

 

Latest Updates