గవర్నర్ ఇంటిముందే నిద్రించిన సీఎం

పుదుచ్చేరి సీఎం వి. నారాయణస్వామి రాజ్ నివాస్ ముందు చేస్తున్న ధర్నా కొనసాగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీరును వ్యతిరేకిస్తూ నారాయణస్వామి బుధవారం నుంచి ధర్నాకు దిగారు. రాత్రంతా రాజ్ నివాస్ ముందే పడుకుని నిరసన తెలిపారు. 39 ప్రభుత్వ నిర్ణయాలను ఓకే చెప్పకుండా కిరణ్ బేడీ అడ్డుకుంటున్నారని, అందులో ఉచిత బియ్యం పథకం కూడా ఉందని నారాయణస్వామి అంటున్నారు. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ కిరణ్ బేడీ నిర్ణయం తీసుకోవడాన్నీ తప్పుబట్టారు. దశల వారీగా నిర్ణయాన్ని అమలు చేయాలని కోరినా.. కిరణ్ బేడీ వినకపోవడంతో ధర్నాకు దిగారు. క్యాబినెట్ నిర్ణయాలను ప్రశ్నిస్తూ నిబంధనలను కిరణ్ బేడీ అతిక్రమిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలతోనే కిరణ్ బేడీ నడుస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అటు నారాయణస్వామికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఫోన్ చేసి మద్దతు తెలిపారు.

Latest Updates