కరోనా టెస్టులు చేయించుకున్న పుదుచ్చేరి సీఎం

పుదుచ్చేరి: ముందు జాగ్రత్త చర్యగా పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామి కరోనా టెస్టులు చేయించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ తో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా వైరస్ టెస్టులు నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా టెస్టులు చేయించుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మెచ్చుకున్నారని సీఎం నారాయణస్వామి మీడియాతో చెప్పారు. పుదుచ్చేరిలో కరోనా కేసుల గురించి, వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై పీఎం వాకబు చేశారని, ఇక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ తీసుకుంటున్న చర్యలపై ఆయనకు వివరించానని చెప్పారు. పుదుచ్చేరికి తక్షణ సాయంగా రూ.995 కోట్లు కేటాయించాలని ప్రధానిని కోరగా సానుకూలంగా స్పందించారని వివరించారు.

Latest Updates