మురికి కాలువలోకి దిగి శుభ్రం చేసిన సీఎం

 పుదుచ్చేరి: గాంధీ జయంతి సందర్భంగా పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి స్వచ్ఛభారత్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వయంగా మురికికాలువలో దిగి దానిని క్లీన్ చేశారు. ఈ వీడియోను సీఎం అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ లో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేలా చేసేందుకే ఈ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని చెప్పారు. సీఎం అయ్యుండి మురికి కాలువను శుభ్రం చేయడం గొప్ప విషయని నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Posted in Uncategorized

Latest Updates