కరోనా డెడ్​బాడీని విసిరేశారు.. పుదుచ్చేరిలో దారుణం

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి డెడ్​బాడీ పట్ల హెల్త్ వర్కర్లు అమానుషంగా ప్రవర్తించారు. పీపీఈ కిట్స్ వేసుకున్న నలుగురు హెల్త్ వర్కర్లు పుదుచ్చేరిలో కరోనా ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయిన ఓ వ్యక్తి డెడ్​బాడీని అంబులెన్స్ లోంచి తీసి గోతిలోకి విసిరేశారు. డెడ్ బాడీని పడేశామని ఆ వర్కర్స్ తమ సూపర్ వైజర్ కి చెప్పగా ఓకే అన్నట్లుగా సైగ చేశాడతడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. డెడ్​బాడీని ఖననం చేసేటప్పుడు కరోనా ప్రొటోకాల్ పాటించలేదని లోకల్ మీడియా ఆరోపించింది. మృతుడి బాడీపై ఒక వైట్ క్లాత్ మాత్రమే కప్పారని, అది కూడా సరిగా కట్టకపోవడంతో గాలిగి పైకి లేస్తున్నా హెల్త్ వర్కర్స్ పట్టించుకోలేదని ఆరోపించాయి. డెడ్​బాడీ ఖననం పూర్తిగా చేశారా లేదా అన్నది కూడా తెలియలేదు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహణలో కరోనా ప్రొటోకాల్ ను విస్మరించినట్లు వీడియో ద్వారా తెలుస్తోందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Latest Updates