న్యూయార్క్ టైమ్స్,వాల్ స్ట్రీట్ లకు పులిట్జర్ అవార్డు

ప్రతిష్టాత్మక పులిట్జర్‌ బహుమతిని ఈ ఏడాది న్యూయార్క్‌‌‌‌ టైమ్స్‌‌‌‌, ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రికలు గెలుచుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌ ఫ్యామిలీ పన్ను ఎగవేత ఆరోపణలపై పరిశోధనాత్మక రిపోర్టిం గ్‌ చేసినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాయి. ట్రంప్‌ పన్నులెగ్గొట్టి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారంటూ వార్తను వేర్వేరుగా ప్రచురించా యి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇద్దరు మహిళలకు రహస్యంగా ట్రంప్‌ డబ్బు లిచ్చారన్న వార్తనూ టైమ్స్‌‌‌‌ వెలుగులోకి తెచ్చింది. పబ్లిక్‌ సర్వీస్‌ విభాగంలో దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సన్‌ సెంటి నెల్‌ అవార్డును గెలుచుకొంది. మార్జరీ స్టోన్‌ మె న్‌ డౌగ్లాస్‌ హైస్కూల్‌ దగ్గర 2018లో జరిగిన మారణహోమానికి ముందు, తర్వాత స్కూలు యాజమాన్యం , లా ఎన్‌ ఫోర్స్‌‌‌‌మెం ట్‌ అధికారులు చేసిన తప్పిదాలను సెంటి నల్‌ వెలుగులోకి తీసుకొచ్చింది. బ్రేకింగ్‌ న్యూస్‌ విభాగంలో పిట్స్‌‌‌‌బర్గ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ గెజిట్‌ అవార్డును సొంతం చేసుకుంది. 2018 అక్టోబర్‌ లో న్యూయార్క్‌‌‌‌లోని యూదుల ప్రార్థన ప్రదేశంలో జరిగిన కాల్పుల ఘటనను పిట్స్‌‌‌‌బర్గ్‌‌‌‌ ప్రసారం చేసింది. కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. న్యూయార్క్‌‌‌‌లోని లాంగ్‌ ఐలాండ్‌లో నివసిస్తున్న ఎల్‌ సాల్వెడార్‌ కు చెందిన వలస ప్రజలపై వరుస కథనాలు రాసినందుకు ప్రోపబ్లికాకు చెందిన హన్నాహ్‌ డ్రయ్యర్‌ ..ఫీచర్‌ రైటింగ్‌ విభాగంలో బహుమతి లుచుకున్నారు. యెమెన్‌ లో యుద్ధ పరిస్థితులపై ఎప్పటి కప్పుడు వార్తలు రాసిన అసోసియేట్‌ ప్రెస్‌ ఇంటర్నేషనల్‌ రిపోర్టిం గ్‌ విభాగంలో ప్రైజ్‌ పొందింది. మయన్మార్‌ లో రోహింగ్యా ముస్లిం లపై జరుగుతున్న దురాగతాలను ప్రపంచానికి తెలియజెప్పిన రాయిటర్స్‌‌‌‌ కూడా ఇంటర్నేషనల్‌ రిపోర్టింగ్‌ విభాగంలో బహుమతి సొంతంచేసుకుంది. బ్రేకింగ్‌ న్యూస్‌ ఫొటోగ్రఫీలోనూ రాయిటర్స్‌‌‌‌ అవార్డు గెలుచుకుంది. సెంట్రల్‌ అమెరికా నుంచి అమెరికాకు వస్తున్న వలస ప్రజల ఫొటోలను అద్భుతంగా రాయిటర్స్‌‌‌‌ కవర్‌ చేసింది.

రచనలు, నాటకం, సంగీతంలో…

….కల్పన – రిచర్డ్‌‌‌‌ పొవర్స్‌ (ది ఓవర్‌‌‌‌ స్టోరీ)

….డ్రామా – జాకీ సిబ్లీస్‌ (ఫెయిర్‌‌‌‌వ్యూ)

….చరిత్ర – డేవిడ్‌ బ్లైట్‌ (ఫ్రెడ్రిక్‌ డౌగ్లాక్‌ : ప్రోఫెట్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ )

….బయోగ్రఫీ – జెఫ్రే స్టెవార్ట్‌‌‌‌ (ది న్యూ నీగ్రో: ద లైఫ్‌ ఆఫ్‌ అలైన్‌ లోకీ)

….కవితలు – ఫొర్రెస్ట్‌‌‌‌ గాండెర్‌‌‌‌ (బీ విత్‌ )

….జనరల్ నాన్‌ ఫిక్షన్ – ఎలిజా గ్రిస్‌ వొల్డ్‌‌‌‌ (అమిటీ అండ్‌ ప్రాస్పారిటీ: వన్‌ ఫ్యామిలీ అండ్‌ ద ఫ్రాక్చురింగ్‌ ఆఫ్‌ అమెరికా)

….సంగీతం – ఎల్లెన్‌ రైడ్‌ (ప్రిజమ్‌ )

Latest Updates