బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు మృతి

pulled-out-of-borewell-after-109-hours-but-two-year-old-declared-dead

పంజాబ్ లో బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు ఫతేవీర్ కథ విషాదాంతమైంది. బోరు బావి నుంచి అధికారులు పైకి తీసినా.. ప్రాణాలు కాపాడలేకపోయారు. 109 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. 150 ఫీట్ల లోతు నుంచి పైకి వచ్చిన బాలుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంగ్రూర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఆడుకుంటూ రెండేళ్ల పసివాడు బోరుబావిలో పడ్డాడు. బావి 150 ఫీట్ల లోతు ఉంది. బోరుపై బట్టతో కప్పి ఉంచగా.. బాలుడు అడుగు పెట్టగానే అందులోకి జారిపోయాడు. మొదట బాలుడి తల్లి కాపాడేందుకు ప్రయత్నించినా విఫలమైంది. NDRF, ఆర్మీ నిపుణులు, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఫతేవీర్ క్షేమంగా బయటపడాలంటూ గ్రామస్తులంతా పూజలు చేశారు. బోరుబావికి సమాంతరంగా పెద్ద గొయ్యి తవ్వారు అధికారులు. ఆక్సీజన్ పంపించారు. కెమెరాను బోరుబావిలోకి పంపి బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. నిన్న ఉదయం బాలుడి కదలికలు గుర్తించారు. 109 గంటల ఆపరేషన్ తర్వాత ఇవాళ తెల్లవారుజామున బాలుడిని పైకి తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు.. అయితే తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫతేవీర్ చనిపోయాడు.

ఫతేవీర్ సింగ్ మృతిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీదంర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

Latest Updates