భారత ఖైదీల రక్తం మరిగింది : జైల్లో పాక్ టెర్రరిస్ట్ హత్య

జైపూర్: పుల్వామా దాడితో ప్రతి భారతీయుడిలో పాకిస్థాన్ పై ఆగ్రహావేశాలను రగిల్చింది. 40 మంది జవాన్లను పొట్టన బెట్టుకున్న ముష్కర మూకలపై కసి తీర్చుకోవాలన్న పంతం పట్టారు. ఇదే పట్టుదల జైలులో ఉన్న భారత ఖైదీల్లోనూ రగిలింది. పాకిస్థాన్ కు చెందిన ఓ ఉగ్రవాదిని జైలులో రాళ్లతో కొట్టి చంపేశారు. 

రాజస్థాన్ లోని జైపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ పాకిస్థానీని బుధవారం తోటి ఖైదీలు హత్య చేశారు. పాకిస్థాన్ ఖైదీతో చిన్న గొడవ జరిగి, అది కాస్తా కొట్లాటగా మారింది. ఆ గొడవలో ఆగ్రహం కట్టలు తెంచుకుని ముగ్గురు ఖైదీలు రాళ్ల దాడికి దిగారు. ఆ పాక్ ఖైదీని కసి తీరా కొట్టి.. కొట్టి చంపేశారు. ఈ ఘటన గురించి తెలియగానే రాజస్థాన్ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారని జైపూర్ జైలు ఐజీ రూపీందర్ సింగ్ చెప్పారు.

మరణించిన పాకిస్థాన్ ఖైదీని షాకర్ ఉల్లా అలియాస్ మహమ్మద్ హనీఫ్ గా పోలీసులు గుర్తించారు. స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా టెర్రరిస్టు అయిన హనీఫ్ ను గూఢచర్యం ఆరోపణలపై 2011లో అరెస్టు చేశారు. నాటి నుంచి జైపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.  టీవీ సౌండ్ విషయంలో గొడవ మొలైందని, అది పెద్దదై హనీఫ్ ని చంపేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

Latest Updates