పుల్వామా ఎటాక్ కు ఏడాది

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14, 2019. ఇండియాకు ఒక బ్లాక్​డే. జమ్మూ-శ్రీనగర్​ హైవేపై పుల్వామా జిల్లా అవంతిపురా దగ్గర సీఆర్​పీఎఫ్ కాన్వాయ్​టార్గెట్​గా టెర్రరిస్టులు ఎటాక్​ చేసిన రోజది. పాకిస్తానీ టెర్రరిస్టు గ్రూపు జైషే మహమూద్​కు చెందిన సూసైడ్​ బాంబర్​ కారులో ఐఈడీతో దూసుకువచ్చి సీఆర్పీఎఫ్ జవాన్లు వెళుతున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకున్న జైషే మహమూద్.. సూసైడ్​ బాంబర్​కు సంబంధించి వీడియోను సైతం రిలీజ్ చేసింది.

మారణహోమం

78 వెహికల్స్​లో 2,500 మందికిపైగా సీఆర్​పీఎఫ్​​ జవాన్లతో వెళుతున్న కాన్వాయ్​పై గతేడాది ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3.15 నిమిషాల టైమ్​లో జమ్మూ-శ్రీనగర్​ నేషనల్​ హైవేపై పుల్వామా జిల్లా అవంతిపురాకు సమీపంలోని లితోపొరా దగ్గర దాడి జరిగింది. 76వ బెటాలియన్​కు చెందిన 40 మంది సీఆర్​పీఎఫ్ జవాన్లు వెళుతున్న బస్సును.. 300 కేజీల పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారుతో ఓ సూసైడ్​ బాంబర్​వచ్చి ఢీ కొట్టాడు. దీంతో బస్సులో ఉన్న 40 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని అదిల్​ అహ్మద్​ దార్​ గా గుర్తించారు. అదిల్ స్వస్థలం పుల్వామా జిల్లా గుండీబాగ్. ఎటాక్​కు ఏడాది క్రితమే అతను జైషేలో చేరాడు. ఎటాక్​ జరిగిన స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకుని, మారుతీ ఎకో వ్యాన్​ను అద్దెకు తీసుకొని అదిల్ దాడికి పాల్పడినట్టు ఎన్​ఐఏ గుర్తించింది. అదిల్​ పేరెంట్స్​ నుంచి సేకరించిన డీఎన్​ఏతో సరిపోలడంతో ఎటాక్​ చేసిందిఅదిలే అని కన్ఫర్మ్​ అయ్యింది. ఈ దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ ఫైటర్​ జెట్స్​ పాకిస్తాన్​లోని బాలాకోట్​లోని జైషే ట్రైనింగ్​ క్యాంప్​పై బాంబుల వర్షం కురిపించాయి. గత నెలలో పుల్వామా ఎటాక్​కు సూత్రధారి, జైషే మహమూద్​ కాశ్మీర్​ చీఫ్​ మహమూద్​ ఖరి యాసిర్​ను అవంతిపురాలోని పరిట్రాల్​ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో భద్రతా బలగాలు హతమార్చాయి.

పుల్వామాలో అమరుల స్థూపం

పుల్వామా ఎటాక్​లో అమరులైన సీఆర్​పీఎఫ్ జవాన్లకు గౌరవ సూచకంగా పుల్వామా జిల్లా లితోపొరా క్యాంప్​లో అమరవీరుల స్థూపం నిర్మించారు. దీని కోసం మరణించిన జవాన్ల ఇండ్ల నుంచి మట్టిని తీసుకొచ్చారు. 40 మంది జవాన్ల పేర్లు, ఫొటోలతో దీనిని నిర్మించారు. శుక్రవారం ఈ స్థూపాన్ని ప్రారంభించనున్నారు. ‘‘వీర మరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించేందుకు ఇదో అవకాశం”అని అడిషనల్​ డైరెక్టర్​ జనరల్​ సీఆర్​పీఎఫ్​ జుల్ఫీకర్​ హసన్​ చెప్పారు.

 

 

 

 

Latest Updates