అరుదైన నివాళి.. అమర జవాన్ల అంత్యక్రియల మట్టిని సేకరించి..

పుల్వామా దాడిలో  అమరులైన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూకాశ్మీర్ లోని లెత్‌పోరా శిబిరంలో స్మారకస్తూప ఆవిష్కరణ జరిగింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు, ఫొటోలను ఆ స్తూపంపై ముద్రించి వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ జాధవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్ల ఇంటింటికి వెళ్లి వారి ఇంటి ఆవరణలోని మట్టిని, అంత్యక్రియలు జరిగిన స్థలంలో మట్టిని సేకరించిన ఉమేష్ ఆ మట్టిని స్తూపం వద్ద సమర్పించారు.

అమరవీరుల కుటుంబాలను కలిసేందుకు దేశ వ్యాప్తంగా 61000 కిలోమీటర్ల దూరం ప్రయాణించానని, వారి కుటుంబసభ్యుల నుంచి ఆశీర్వాదం తీసుకుని లెత్‌పోరాకు చేరుకున్నానని తెలిపారు ఉమేష్. ఆ జవాన్ల కుటుంబాలను కలినందుకు తనకు చాలా గర్వంగా ఉందన్నారు. పుల్వామా దాడి జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అమరులకు ఏర్పాటు చేసిన స్మారకస్థూపం వద్ద అధికారులు నివాళులర్పించారు.

Pulwama attack: man collected soil from homes of all 40 martyrs to build memorial

Latest Updates