పుల్వామా సూత్రధారి 23ఏళ్ల ఎలక్ట్రీషియన్‌‌‌‌‌‌‌‌

వివరాలు వెల్లడించిన ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పుల్వామా దాడికి ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యక్తిని నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెష్టి గేషన్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ గుర్తించింది. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పుల్వా మా జిల్లాకు చెందిన ముదసిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌ భాయ్‌ దాడికి ఉపయోగించిన కారు, పేలుడు పదార్థా లను సమకూర్చినట్లు గుర్తించామని అధికారులు చెప్పారు. 23 ఏళ్ల అహ్మద్‌ గ్రాడ్యుయే షన్‌‌‌‌‌‌‌‌ చదివాడు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌‌‌‌‌‌‌‌ డిప్లమా కోర్సు పూర్తి చేశాడు. అహ్మద్‌ తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని అధికారులు చెప్పా రు. 2017లో జైషేమహ్మద్‌ టెర్రర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో చేరాడు. గత నెల 14న సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌ కాన్వాయ్‌ పై దాడి చేసిన మానవబాంబు అదిల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌ దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి వరకు .. ఖాన్‌‌‌‌‌‌‌‌తో కాంటా క్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2018 ఫిబ్రవరిలో సున్జా వన్‌‌‌‌‌‌‌‌ ఆర్మీ క్యాంప్‌‌‌‌‌‌‌‌పై జరిగిన అటాక్‌‌‌‌‌‌‌‌, లె థ్‌ పొ రా అటాక్‌‌‌‌‌‌‌‌లోనూ అహ్మద్‌ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

Latest Updates