అమరవీరులకు నివాళి : నేడు వ్యాపారుల బంద్‌

ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన CRPF సిబ్బంది కుటుంబాలకు సంఘీభావంగా దేశవ్యాప్త బంద్‌ నిర్వహించాలని ‘అఖిల భారత వ్యాపారుల సమాఖ్య’(సీఏఐటీ) పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఇవాళ వ్యాపారుల బంద్‌ జరగనుంది. సోమవారం వాణిజ్య సముదాయాలన్నీ మూతపడతాయని, వ్యాపార కార్యకలాపాలేవీ కొనసాగవని సీఏఐటీ ఒక ప్రకటనలో తెలిపింది. బంద్‌ సందర్భంగా సోమవారం వ్యాపారులు ఉపవాసం ఉంటారని, రాష్ట్రాల్లో అమరవీరులకు నివాళిగా ఊరేగింపు నిర్వహిస్తారని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ చెప్పారు.

Latest Updates