మేలు చేసే గుమ్మడి గింజలు

శరీరంలో కొవ్వు పేరుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అనవసరపు కొవ్వు వల్ల స్థూలకాయం సమస్య తలెత్తి దాని ద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శరీరంలో చేరే కొవ్వు నిల్వలను ఎంతగా నివారిద్దామన్నా ఒక్కోసారి వీలు కాకపోవచ్చు. అలాం టప్పుడు ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం వల్ల ఆ సమస్యను తగ్గించొచ్చు. అలా శరీరంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలనే పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వాళ్లలో… అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీని వల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. కొవ్వు తగ్గడం మాత్రమే కాదు, ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారో…అటువంటి వాళ్లకు ఈ గుమ్మడి గింజలు బాగా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

Latest Updates