ఘోరం: నిర్మాణంలో ఉన్న గుడి శ్లాబ్ కూలి ముగ్గురి మృతి

పుణే: దేవాలయం నిర్మాణంలో అపశృతి జరిగింది. శ్లాబ్ వేస్తుండగా.. అది కుప్పకూలి అక్కడ పని చేస్తున్న ముగ్గురు కూలీలు మరణించారు. మహారాష్ట్రలోని పుణేలో ఈ దారుణం జరిగింది.

పుణేలోని పింపుల్ గురావ్ ప్రాంతంలో గుడి కడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దాని శ్లాబ్ పనులు మొదలు పెట్టారు. కొంత శ్లాబ్ వేశాక.. దాని సపోర్ట్ కదిలి మొత్తం కూలిపోయింది. దీంతో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొంతుతూ ముగ్గరు మరణించారు. మరో కూలీ పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

Latest Updates