కరోనా హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా మారిన బిజినెస్ మ్యాన్

కరోనా వైరస్ సోకి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఓ బిజినెస్ మ్యాన్ వార్డ్ బాయ్ గా మారి ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవ చేస్తున్నారు.

బిజినెస్ చేస్తే నెలకు రూ.60,70వేలు వస్తున్నా … ఆ శాలరీ వద్దనుకొని రూ. 16వేలకే వార్డ్ బాయ్ గా విధులు నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మహరాష్ట్ర పింపిరి చించ్ వాడ్ ఇంద్రాయణి నగర్ కు చెందిన గైక్వాడ్, సవితలు భార్య భర్తలు. గైక్వాడ్ ఓ సెక్యూరిటీ ఏజెన్సీ పార్టనర్ గా బిజినెస్ చేస్తున్నారు. సవిత పీసీఎంసీ భోసారి ఆస్పత్రిలో నర్స్ గా విధులు నిర్వహిస్తుంది.

సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్న గైక్వాడ్ కు కరోనా సోకి వైసీఎంహెచ్ ఆస్పత్రిలో చేరాడు. కరోనా సోకకముందు 13రోజుల పాటు జ్వరం, బాడీ పెయిన్స్ తో బాధపడినట్లు చెప్పాడు.

జ్వరం టాబ్లెట్లు వేసుకోవడంతో తగ్గిందని, మూడురోజుల తరువాత మళ్లీ జర్వం రావడంతో వైసీఎంహెచ్ ఆస్పత్రికి వెళ్లగా..అక్కడి వైద్యులు పలు టెస్ట్ లు చేసి మలేరియా, డెంగ్యూ ఫివర్ అటాక్ అయ్యిందని, కరోనా సోకలేదని తెలిపారు.

నాలుగురోజుల తరువాత జ్వరం తగ్గి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పిన గైక్వాడ్..నాలుగురోజుల తరువాత స్థానికంగా ఉండే క్లీనిక్ లో మరోసారి టెస్ట్ లు చేయగా ఆ టెస్ట్ ల్లో కరోనా సోకిందన్నారు.

దీంతో అత్యవసర చికిత్స కోసం వైసీఎంహెచ్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. ఐదురోజుల పాటు ఐసీయూ నుంచే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా నా భార్య ఇలా నువ్వు బ్రతుకుతావని మాకు నమ్మకం లేదని బాధతో మెసేజ్ చేసింది.

ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ అయ్యాను. కరోనా తగ్గింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తరువాత 20రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉన్న. ఈ క్రమంలో పీసీఎంసీ ఆస్పత్రి లో వార్డ్ బాయ్ కావాలంటూ పేపర్ లో ప్రకటన చూశానని, మనిషి లేనప్పుడు మనకు ఎంతడబ్బు ఉంటే ఏం లాభం.

దేవుడి దయతో ఆరోగ్యంగా ఉన్నా. కరోనా పేషెంట్లకు సేవ చేయాలని నిశ్చయించుకున్నా. అందుకే నేను బిజినెస్ చేస్తే నాకు రూ.60,70 వేలు వస్తాయి. కానీ మానవత్వంతో పీసీఎంసీ కరోనా వార్డ్ లో వార్డ్ బాయ్ గా పని చేస్తున్నట్లు గైక్వాడ్ తెలిపారు.

Latest Updates