పారిపోయే అవకాశం ఉందట : వరవరరావుకు కోర్టు నో బెయిల్

పుణె: బీమా కోరేగావ్ కేసులో పుణె పోలీసుల అదుపులో ఉన్న విరసం నేత వరవరరావుకు బెయిల్ ఇవ్వలేదు కోర్టు. తన బంధువు మరణించాడని.. ఆ తర్వాత జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెయిల్ కావాలని పుణె కోర్టును అభ్యర్థించారు వరవరరావు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వ‌ర‌కు తాత్కాలిక బెయిల్ కావాలంటూ కోర్టును కోరారు.అయితే సోమవారం దీనిపై వాదనలు విన్న కోర్టు బెయిల్ నిరాకరించింది.

ఒక‌వేళ వ‌ర‌వ‌ర‌రావును హైద‌రాబాద్‌ కు పంపిస్తే, అత‌ను పారిపోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్రాసిక్యూట‌ర్ కోర్టు ముందు వాదించారు. బీమా కోరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుతో పాటు ఢిల్లీ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ సాయిబాబా కూడా పుణె పోలీసుల అదుపులో ఉన్నారు. విప్లవ క‌వి వ‌ర‌వ‌ర‌రావును విడుద‌ల చేయాల‌ని ఆదివారం విర‌సం నేత‌లు డిమాండ్ చేశారు.

 

Latest Updates