పనిమనిషి బిజినెస్ కార్డు.. ఆఫర్లే ఆఫర్లు

చాలావరకు డిజిటలైజేషన్ అయిన ఈ ప్రపంచంలో చదువుకున్న యువత చాలామంది  తమ విద్యార్హతను బట్టి నౌకరీ, లింక్డ్ ఇన్, మోనస్టర్ లాంటి జాబ్ వెబ్ సైట్ ల సహయంతో అవకాశాలను  అందిపుచ్చుకుంటున్నారు. కంపెనీల నుంచి ఫోన్ కాల్స్ తో కోరుకున్న కొలువును సంపాదిస్తున్నారు.  ఇప్పుడు అలాంటి కాల్స్ ఓ సాదా సీదా పనిమనిషి కి వస్తున్నాయి. ఆ మహిళను తన ఇంట్లో పనికి కుదరాలని ఇంటి యజమానులంతా ఒకటే ఫోన్ల మీద ఫోన్ల చేస్తున్నారు. అదెలాగంటే..

పూణేలోని  నివాసముంటున్న ధనశ్రీ షిండే ఇంట్లో పనిచేసే గీతా కాలే అనే పనిమనిషి ఓ చోట తన పని కోల్పోయానంటూ వచ్చి బాధపడింది. నాలుగు ఇళ్లల్లో పని చేస్తేనే తనకు ఇల్లు గడుస్తుందని, ఆ పని కోల్పోవటం వల్ల  నెలకు రూ.4000 ఆదాయం పోతుందని చెప్పింది.  ఓ కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్న ధనశ్రీ..  ఆ పనిమనిషి బాధ విని ఆమెకు తన వంతు సాయంగా ఏదైనా చేయాలనుకుంది. అనుకున్నదే తడువుగా గీతా కాలే పేరు మీద ఓ బిజినెస్ కార్డును తయారు చేసి, దానిపై “గీతా కాలే, బావ్ధాన్ లోని ఘర్ కామ్ మౌషి (గీతా కాలే, మీ ఇంటి పనుల్లో సాయపడేందుకు)”  అని రాసి, అందులో గీత మొబైల్ నెంబర్ ని ఉంచింది.  ఏఏ పనులకు ఏంత చార్జ్ చేస్తుందో ఆ వివరాలన్ని పొందుపరిచి, ఓ 100 కార్డులు ప్రింట్ చేయించింది. ఆ కార్డులను  అమె అపార్ట్ మెంట్ వద్ద ఉన్న వాచ్ మెన్లకు, ఆ వీధిలో ఉండే చిరు వ్యాపారస్తులకు పంచమని ఇచ్చింది. ఆ కార్డులను అందుకున్న వారంతా గీతా కు కాల్స్ చేయడం మొదలెట్టారు.

అంతేకాదు ఆ కార్డును అస్మిత అనే మహిళ ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో ఒక్క రాత్రిలోనే ఆ ఫోటో వైరల్ అయింది.  ఒక్క బిజినెస్ కార్డు వల్ల గీతా కు చాలా ఆఫర్లు వస్తున్నాయి. తమ ఇంట్లో పని ఉందని, ఓ పనిమనిషి కోసం వెతుకుతున్నామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఒక్క పూణేలోనే కాదు.. దేశంలోని ప్రతి చోట నుంచి కాల్స్ రావడంతో గీత ఫోన్ రింగ్ అవడం మానట్లేదు.

Pune Maid Flooded With Job Offers After Her Business Card Goes Viral

 

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates