గుంత తవ్వుతుంటే.. బయటపడ్డ సొరంగం

పుణేలో మెట్రో కోసం గుంత తవ్వుతుంటే.. ఓ సొరంగం బయటపడింది. స్వర్ గేట్ ప్రాంతంలో ఉన్న ఈ సొరంగం 90 ఏళ్ల నాటిదని స్థానిక చరిత్రకారుడు మందర్ లవాటే చెప్పారు. బ్రిటీషోళ్లు నీటిని సరఫరా చేసేందుకు ఆ సొరంగాన్ని వాడుకుని ఉంటారని, దీనికి దగ్గర్లోనే కాలువ, నీటి కుంట ఉన్నాయని చెప్పారు. ఆ నీళ్లతోస్విమ్మింగ్ పూల్స్ నింపడానికే తవ్వి ఉంటారని చెప్పారు. ఈ సొరంగం 57 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తు ఉంది. మెట్రో పిల్లర్ల కోసం పునాదులు తవ్వుతుండగా ఇది కనిపించిందని సైట్ ఇంజనీర్ ఒకరు చెప్పారు. కెనాల్ నుంచి 1200 మిల్లీమీటర్ల పైప్ దానికి కనెక్ట్ చేసి ఉందని చెప్పారు. భూమికి 25 మీటర్ల లోతులో ఈ సొరంగాన్ని గుర్తించారు.

Latest Updates