అందరికీ నార్మాల్ మాస్క్.. ఈయనకు మాత్రం గోల్డ్ మాస్క్

కరోనా కారణంగా జనాలందరూ మాస్కులు, గ్లోవ్స్ వాడుతున్నారు. మాస్కులకున్న డిమాండ్ దృష్ట్యా.. మార్కెట్లో రకరకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. వైరస్ నుంచి కాపాడుకునేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పూణేకు చెందిన గోల్డ్ మ్యాన్ శంకర్ కురాడే డిఫరెంట్ మాస్క్ వాడాలనుకున్నాడు. అందుకోసం వినూత్నంగా గోల్డ్ మాస్క్ తయారుచేయించుకున్నాడు. దీనికోసం దాదాపు రూ. 3 లక్షల వరకు ఖర్చయినట్లు శంకర్ తెలిపాడు. ఈ బంగారు మాస్కుకు కూడా మాములు మాస్కులాగే అతిచిన్న రంధ్రాలున్నాయి. అందువల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులేవీ లేనట్లు శంకర్ తెలిపాడు. అయితే ఈ గోల్డ్ మాస్క్ కరోనా నుంచి ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం తెలియదని ఆయన అన్నారు.

For More News..

ఆన్​లైన్ క్లాసులతో ఫాయిదా లేదు

చిరుతెక్కడ? 50 రోజులైనా జాడ లేదు

ఆర్టీసీలో వద్దన్నరు..  సింగరేణిలో సై అన్నరు

Latest Updates