గుడియా రేప్ కేసు దోషులకు 30న శిక్ష ఖరారు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఐదేళ్ల బాలిక గుడియాను 2013 ఏప్రిల్15న కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు మనోజ్​ షా, ప్రదీప్ కుమార్​లను ఢిల్లీ కోర్టు శనివారం దోషులుగా తేల్చింది. ‘బాధితురాలిపై వికారమైన, తిరుగుబాటు పద్ధతిలో అతి క్రూరంగా నేరానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన యావత్ సమాజ మనసుల్ని కదిలించివేసింది’ అని కోర్టు అభిప్రాయపడింది. గుడియాను దోషులిద్దరూ 2013 ఏప్రిల్ 15న కిడ్నాప్ చేసి పలుమార్లు రేప్​కు పాల్పడ్డారు. చిన్నారి అన్ కాన్షియస్ లోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని రూమ్ లోనే వదిలేసి పరారయ్యారు. చిన్నారిని హాస్పిటల్​కు తరలించగా ఏడాది తర్వాత కోలుకుంది. ఫోక్సో చట్టం కింద ఐదేళ్లపాటు విచారణ జరిగిన ఈ కేసులో దోషులిద్దరికి ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు అనంతరం కోర్టు నుంచి బయటికి తీసుకువెళ్తుండగా దోషుల్లో ఒకరైన మనోజ్​షా విలేఖరిపై దాడి చేశాడు.

For More News..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

 

Latest Updates