బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. 13 మంది మృతి

పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో జరిగిన ఈ పేలుళ్లలో శిథిలాల క్రింద 50 మందికి పైగా చిక్కుకొని ఉన్నట్టు తెలిసింది.  పేలుడు ధాటికి సమీపంలో ఉన్న ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి

గాయాలపాలైన వారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates