ఒకటికి రెండు తలలు తేవాల్సిందే: పంజాబ్ సీఎం

పుల్వామా దాడి విషయంలో తమకు ఆదారాలు కావాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకు పడ్డారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. గతంలో జరిగిన దాడులపై.. చాలా ఆదారాలు ఇచ్చామని ఇక ఆదారాలు ఇవ్వడం వల్ల టైమ్ వేస్ట్ చేయడం తప్ప మరేమీ లేదని ఆయన అన్నారు. పాకిస్తాన్ కు ఏ భాష అయితే అర్థం అవుతుందో.. అదే భాషలోనే సమాదానం చెప్పాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. మన జవాను ఒకరు అమరులైతే రెండు తలలు తేవాలని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఒక వైపు ఉగ్ర చర్యలకు తావిస్తూనే మరోవైపు నీతి సూక్తులు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రపంచానికి పాక్ అంటే ఏంటో తెలుసని కొత్తగా మీరు చెప్పేది ఏం లేదని అన్నారు.

పాకిస్తాన్ లో నక్కి.. బారత్ లో ఉగ్ర దాడులు జరుపుతున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను మట్టుబెట్టడమే మన ముందున్న పని అని పంజాబ్ సీఎం అన్నారు. పాకిస్తాన్ లోని బహావల్పూర్ లో మసూద్ ఉన్నాడని ఆయన చెప్పారు. మసూద్ ను పాక్ పట్టుకోకపోతే తమకుఏంచేయాలో తెలుసని అన్నారు.

పాకిస్తాన్ కు ఉగ్రచర్యలో బాగం లేదన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఏ దేశం ఇచ్చిందో తెలువదా అని ప్రశ్నిస్తున్నారు.

Latest Updates