KKR vs KXIP: పంజాబ్ టార్గెట్-150

ఐపీఎల్-13లో భాగంగా సోమవారం పంజాబ్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో కోల్ ‌కతా నైట్ ‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన కోల్‌ కతా 10 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. నితీశ్ రాణా (0), రాహుల్ త్రిపాఠీ (7), దినేశ్ కార్తీక్ (0)లు దారుణంగా విఫలమయ్యారు. అయితే, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రీజులోకి రావడంతో వికెట్ల పతనానికి బ్రేక్ పడింది. కెప్టెన్ అండతో శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. 45 బాల్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 రన్స్ చేశాడు. ఇయాన్ మోర్గాన్ కూడా చెలరేగాడు. 25 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 రన్స్ చేశాడు.

పది ఓవర్లలో జట్టు స్కోరు 90 పరుగులు దాటడంతో భారీ స్కోరు ఖాయమని భావించారు. అయితే, 91 రన్స్ దగ్గర మోర్గాన్ అవుట్ కావడం, ఆ వెంటనే సునీల్ నరైన్ (6), కమలేశ్ నాగర్ కోటి (6), పాట్ కమిన్స్ (1) అవుట్ కావడంతో స్కోరు వేగం తగ్గింది. అయితే చివర్లో ఆల్ రౌండర్ ఫెర్గ్యూసన్ 13బాల్స్ లో 3 ఫోర్లు, సిక్సర్ ‌తో 24 రన్స్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. చివరి ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే రావడంతో 149 పరుగులకు పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో షమీ 3 వికెట్లు తీసుకోగా, జోర్డాన్, బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు, మ్యాక్స్‌వెల్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

Latest Updates