పంజాబ్ లో ఫస్ట్ కరోనా పేషెంట్ రికవర్

చంఢీఘర్ : పంజాబ్ లో కరోనా సోకిన ఫస్ట్ ఫ్యామిలీ రికవర్ అయ్యింది. నవన్ షర్ కు చెందిన మొత్తం 14 మంది ఫ్యామిలీ మెంబర్స్ లో 12 మందికి కరోనా నెగిటివ్ గా తేలింది. మరో ఇద్దరు హాస్పిటల్ లోనే ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో 70 ఏళ్ల ఫస్ట్ కరోనా బాధితుడు కూడా ఉన్నారు. అతని ద్వారా ఫ్యామిలీలోని మిగతా 13 మందికి కరోనా సోకింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నవన్ హార్ సివిల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇచ్చారు. జర్మనీ నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా నవన్ షర్, జలంధర్, హోషియర్ పూర్ జిల్లాలో 27 మంది కరోనా సోకింది. జర్మనీ నుంచి వచ్చిన ఆ వ్యక్తి మార్చి 18 న చనిపోయాడు. కరోనా అనుమానిత లక్షణాలుండటంతో చనిపోయిన తర్వాత టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన ద్వారా నవన్ షర్ లో 70 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా వచ్చింది. ఆయన ద్వారా ఫ్యామిలీ అందరికి సోకింది. ఐతే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కరోనా నుంచి కోలువటంతో హ్యాపీగా ఉన్నారు. మిగిలిన ఇద్దరి ఆరోగ్యం కూడా స్టేబుల్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి ఫ్యామిలీ లో కూడా నలుగురికి కరోనా సోకకగా వారు కూడా కోలుకోవటంతో మంగళవారం వారిని డిశ్ఛార్జ్ చేశారు. వీరిలో 2 ఏళ్ల చిన్నారి కూడా ఉంది.

Latest Updates