వ్యవసాయ బిల్లులపై సుప్రీంలో తేల్చుకుంటాం

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులపై నిరసనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. ఈ వివాదంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అయిన అకాలీదళ్ బీజేపీ కూటమి నుంచి వైదొలిగింది. పంజాబ్‌‌ అధికార పక్షమైన కాంగ్రెస్ నయా బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రకటించారు. వ్యవసాయ వ్యతిరేక బిల్లులపై కోర్టులోనే తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘మా న్యాయవాదులు ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారితో సమాలోచనలు చేస్తాం’ అని సింగ్ తెలిపారు. రైతుల నిరనసల్లో పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొనాలని అమరిందర్ కోరారు.

Latest Updates