ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ ను తగలబెట్టిన నిరసన కారులు

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  పంజాబ్ యూత్ కాంగ్రెస్ నేతలు  ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో నిరసన తెలుపుతూ ఓ ట్రాక్టర్ కు నిప్పంటించారు. డీసీఎంలో ట్రాక్టర్ ను తీసుకొచ్చి అక్కడ దింపేసి దానిని తగలబెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  నిరసనలో భాగంగా ట్రాక్టర్ను తగలబెట్టిన కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర వ్యవసాయ బిల్లులకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలపగా నిన్న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

చెరువులోకి బోల్తా కొట్టిన కారు.. కారులో నుండి సురక్షితంగా బయటపడిన ఎస్.ఐ

Latest Updates