ఆత్మహత్యకు పాల్పడ్డ పంజాబీ కుటుంబం

హైదరాబాద్: నగరంలోని అంబర్ పేట్ డీడీ కాలనీలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. పంజాబ్ కు చెందిన పవన్ కర్భందా కుటుంబం మూడు సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చింది. అంబర్ పేట్ లోని DD కాలనీ లో నివాసముంటున్న వారు.. మూడు రోజుల క్రితం కూల్ డ్రింక్స్ లో విషం కలుపుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా..  పవన్ కర్బంధా, అతని భార్య నీలం చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నాం మరణించారు. వారి కొడుకు నిఖిల్, కుమార్తె మను పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు సమాచారం. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Latest Updates