5 కేజీల మటన్‌ కొంటే హెల్మెట్‌ ఫ్రీ

5 కేజీల మటన్ కొనుగోలు చేస్తారో వారికి 500 ఖరీదైన హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇస్తున్నాడు ఓ వ్యాపారి. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వెంకటేశ్వరరావు మటన వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో లాభాలు గడిస్తూ కష్టమర్లకు శ్రేయస్సు కోసం ఓ ఆఫర్ ప్రకటించాడు. తన వద్ద  5 కేజీల మటన్‌ కొనుగోలు చేస్తే ఒక హెల్మెట్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. రోడ్డు ప్రమాదాల్లో తన వినియోగదారుల ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకూడదంటూ హెల్మెట్లు ఇస్తున్నాడు. తద్వారా తన వ్యాపారం అభివృద్ధి చెందుతోందని అంటున్నాడు. అంతేకాకుండా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు కూడా తనవంతు కృషి చేస్తున్నాడు. తన వద్ద మటన్‌ కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులు వారి ఇంటి నుంచే స్టీల్ బాక్స్‌లు తీసుకు వచ్చినట్లయితే కేజీకి రూ.20 చొప్పున తగ్గిస్తానంటున్నాడు.

Latest Updates