వెజిటేరియన్​ నీళ్లు.. కంపెనీ యాడ్ పై నెటిజన్ల ఫైర్​

pure-vegetarian-water-this-purifier-ad-leaves-netizens-in-splits

తిండిలో మాంసాహారం, శాకాహారం ఉన్నాయి. మరి, నీళ్ల మాటేంటి? ఎహె, ఊరుకోండి నీళ్లలోనూ వెజిటేరియన్​, నాన్​వెజిటేరియన్​ ఉంటాయా ఏంటి? అంటారా? ఈ యాడ్​ తీరు అలాగే ఉంది మరి. ఓ వాటర్​ ప్యూరిఫయర్​ ఇచ్చిన ఆ యాడ్​ ఇప్పుడు జనాన్ని ఆశ్చర్యపరిచింది. తమ ప్యూరిఫయర్లు ప్యూర్​ అండ్​ వెజిటేరియన్​ వాటర్​ ఇస్తుందని ఆ కంపెనీ యాడ్​ ఇచ్చింది. ‘ప్యూర్​ వెజిటేరియన్​ వాటర్​? అడ్వర్టైజింగ్​ జిమ్మిక్కా!’ అంటూ స్టార్ట్​ అయ్యి అసలు విషయంలోకి తీసుకెళుతుంది కంపెనీ. కానే కాదంటూ వెజిటేరియన్​ వాటర్​ ఎలాగో వివరించే ప్రయత్నం చేసింది.

‘‘మార్కెట్లో ఎన్నో రకాల ప్యూరిఫయర్లున్నాయి. అవి నీళ్లలో ఉన్న క్రిములను చంపేస్తున్నాయి. కానీ, చచ్చిపోయిన ఆ క్రిములు నీళ్లలో అలాగే ఉండిపోతున్నాయి. అంటే అవి నాన్​వెజిటేరియన్​ నీళ్లే కదా. కానీ, మా ప్యూరిఫయర్​ మాత్రం నీళ్ల నుంచి ఆ చచ్చిపోయిన క్రిములను కూడా తొలగించేస్తుంది. కాబట్టి, స్వచ్ఛమైన వెజిటేరియన్​ నీళ్లనిస్తాయి” అంటూ ప్రకటనలో రాసుకొచ్చింది. అయితే, ఆ యాడ్​ కాస్తా ట్విట్టర్​లో వైరల్​ అయింది. నెటిజన్లు ఆ ఫొటోను పోస్ట్  చేసి చాలా మంది ఫన్నీ కామెంట్లు చేశారు. కొందరైతే యాడ్​ను తిట్టిపోశారు. నీళ్లలోనూ నాన్​వెజిటేరియన్​ ఉంటాయా, ఇలాంటోళ్లను జన్మలో మార్చలేమంటూ మండిపడ్డారు. బాగు చేయలేనంత చెడ్డగా మారిపోయింది దేశమంటూ మరికొందరు కామెంట్​ చేశారు.

Latest Updates