తిరుమలలో ఘనంగా పుష్పయాగ మహోత్సవం

తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది TTD. ఇందులో భాగంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5గంటల వరకు వివిధ రకాల పూలు, పత్రాలతో స్వామి వారికి పుష్పార్చన చేయనున్నారు. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను TTD సేకరించింది. భక్తులు విరాళంగా పంపిన ఈ పూలకు ముందుగా పూలమాలలు తయారు చేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆ తర్వాత TTDఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. పుష్పయాగాన్ని పురస్కరించుకొని ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని రద్దు చేశారు ఆలయాధికారులు.

Latest Updates