స్కూళ్లకు కొత్త గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ : లంచ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌లో పాటలు, మ్యూజిక్‌‌‌‌

న్యూఢిల్లీ: స్టూడెంట్స్‌‌‌‌లో ప్రశాంతత, శాంతి స్వభావాన్ని పెంచేందుకు మ్యూజిక్‌‌‌‌ చాలా ఉపయోగపడుతుందని నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌టీ) చెప్పింది. లంచ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌లో స్టూడెంట్స్‌‌‌‌ వయసుకు తగ్గట్లుగా పాటలు, మ్యూజిక్‌‌‌‌ను పెట్టాలని స్కూళ్లకు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ఇచ్చింది. “ మ్యూజిక్‌‌‌‌ పిల్లల్లో గ్రాస్పింగ్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ పెంచుతుంది, ప్రశాంత, శాంతి స్వభావాన్ని పెంపొందిస్తుంది.

లంచ్‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌లో పాటలు, మంచి మ్యూజిక్‌‌‌‌ను వినిపించడం ద్వారా క్రియేటివ్‌‌‌‌, ఆనంద వాతావరణం పెంపొందుతాయి” అని చెప్పింది. జామియా మిలియా ఇస్లామియా లెక్చరర్లు స్టడీ చేసి మరీ దీన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. దాదాపు 34 కార్పొరేట్‌‌‌‌ స్కూళ్లలో దీనిపై రిసెర్చ్‌‌‌‌ చేశారని చెప్పారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్‌‌‌‌‌‌‌‌ ప్రైమరీ లెవల్‌‌‌‌లో ఆర్ట్‌‌‌‌ టీచింగ్‌‌‌‌కు సంబంధించి కొత్త గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ఇచ్చారు.

Latest Updates