స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ ను భారత్‌లో తయారు చేసుకోవచ్చు: పుతిన్

రష్యా తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి టీకాను ఇండియా తయారు చేసుకోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇండియాతో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. బ్రిక్స్ దేశాల్లో వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేయాలని పుతిన్ సూచించారు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రజలను కరోనా నుంచి రక్షించడంలో 92 శాతం వరకూ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్టు ట్రయల్స్ మధ్యంతర ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ ను రష్యాలో వాడేందుకు ఆగస్టులోనే పుతిన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత భారీ ఎత్తున ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

సెప్టెంబర్ లో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (RDIF) తో ఇండియాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ వ్యాక్సిన్ తయారీ కోసం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇండియాలో స్పుత్నిక్ వి ట్రయల్స్, ఆపై పంపిణీని డాక్టర్ రెడ్డీస్ పర్యవేక్షించనుంది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా 10 కోట్ల డోస్ లను RDIF ఇండియాకు పంపించనుంది.

Latest Updates