మంత్రిగా ప్రమాణం చేసిన పువ్వాడ

పువ్వాడ అజయ్ కుమార్ మొదటి సారి మంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళి సై అజయ్ చేత ప్రమాణం చేయించారు. పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి నాగేశ్వర రావు సీపీఐలో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. అజయ్ 2012 నుంచి 2013 మధ్య వైసీపీ ఖమ్మం జిల్లా కన్వీనర్ గా.. తర్వాత ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జ్ గా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పువ్వాడ.. 2014 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావుపై అజయ్ విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ లో చేరారు. 2018లో ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు పువ్వాడ.

Latest Updates