ఇచ్చినవి ప్రధానమంత్రి చెక్కులు.. పాడింది సీఎం పాట

సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ స్కీం కింద మంగళవారం ఖమ్మంలో స్ట్రీట్ వెండర్లకు లోన్లు ఇచ్చే ప్రోగ్రామ్ నిర్వహించారు. జీవనజ్యోతి బీమా యోజన సెంట్రల్ స్కీం  కింద మున్సిపల్ కార్మికులకు జీవిత బీమా పాలసీలు, కిట్లనూ పంపిణీ చేశారు. కానీ అంతా టీఆర్ఎస్, ఇక్కడి సర్కారు కార్యక్రమం లెక్కనే చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ ఎక్కడా కేంద్ర సర్కారు, ప్రధాని మోడీ పేరుగానీ, ఆత్మనిర్భర్  భారత్ స్కీంను గానీ ప్రస్తావించకుండానే మాట్లాడారు. పైగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల చొరవతోనే సాయం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. వేదికపై పెట్టిన ఫ్లెక్సీలోనూ ‘పీఎం స్వానిధి పథకం’అని ఎటూ తెలియకుండా రాయించారు. ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్ అయినా, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయ ఇన్ ఛార్జ్ కృష్ణను వేదికపై కూర్చోబెట్టుకున్నారు.

చెక్కులు అందజేసి..

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన స్ట్రీట్ వెండర్లకు మంగళవారం సెంట్రల్ స్కీమ్ కింద లోన్లు ఇచ్చారు. 841 మందికి రూ.84.10 లక్షల చెక్కులను మంత్రి పువ్వాడ అందజేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ బయట తొలిసారిగా ఖమ్మం జిల్లాలో నే స్ట్రీట్ వెండర్లకు గుర్తించి.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణాలను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. స్ట్రీట్ వెండర్లు గౌరవంగా జీవించాలనే సంకల్పం తో సీఎం, కేటీఆర్ల చొరవతో వారికోసం ప్రత్యేక ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Latest Updates