దేశ ఎకానమీనీ మార్చిన వ్యక్తి పీవీ

మైనార్టీ సర్కారైనా డైనమిక్ డెసిషన్స్ తీసుకున్నారు
దేశ ఎకానమీ దశ మార్చి దిశ చూపించిన వ్యక్తి పీవీ

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఓ వైపు పీకల్లోతు ఊబిలో కూరుకున్న దేశ ఎకానమీ. ప్రతిసారి అప్పు కోసం ఐఎంఎఫ్ దగ్గరకు ఉరకాల్సిన పరిస్థితి. బంగారం నిల్వలను తాకట్టు పెడితే గానీ పెట్రోల్, డీజిల్ కొనుక్కోలేని దీన స్థితి. ఇంకోవైపు మెజార్టీ లేని సర్కారు. ఏ మిత్రపక్షాన్ని నొప్పించినా ప్రభుత్వానికే ఎసరొచ్చే పరిస్థితి. ఇట్లాంటి టైమ్​లో ఎవరు ప్రధాని అయినా సేఫ్ గేమ్ ఆడతారు. ఆచితూచి అడుగులేస్తారు. కానీ పీవీ నరసింహారావు మాత్రం ఆచితూచి కాదు.. అందరూ అవాక్కయ్యే నిర్ణయాలు తీసుకున్నారు. సాహసోపేతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఊబిలోని ఎకనామీని దౌడు తీయించారు.

యాక్షన్​లోకి దిగారు
అస్థిరమైన రెండు ప్రభుత్వాల అజమాయిషీలో దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానమైన టైమ్​లో ప్రధానిగా పీవీ బాధ్యతలు తీసుకున్నారు. ఫైనాన్స్‌‌ మినిస్టర్‌‌గా మన్‌‌మోహన్‌‌ సింగ్‌‌ను ఎంపిక చేసుకోవడంతోనే తన ఆలోచనలు ఒకింత తెలిసేలా సంకేతాలిచ్చారు. నెహ్రూ నాటి విధానాలు మారిన పరిస్థితుల్లో సరిపోవని, ఎకానమీకి కొత్త దశ తీసుకురావాలంటే దిశ మార్చాల్సిందేనని యాక్షన్‌‌లోకి దిగారు. విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి దేశంలో ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట వేస్తేనే మన ఎకానమీ పరుగు అందుకుంటుందని గుర్తించారు.

ఎకానమీ లాక్‌ తీశారు
ఎకనమిస్ట్‌‌ పత్రిక ఓ సందర్భంలో చెప్పినట్టు.. అప్పటిదాకా బోనులో ఉన్న పులి (ఎకానమీ)ని పీవీనే బయటకు తీసుకొచ్చారు. విదేశీ పెట్టుబడులు రావాలంటే బ్యూరోక్రసీ పాత్ర తగ్గాలని, పర్మిషన్ల కోసం గవర్నమెంట్‌‌ చుట్టూ తిరగాల్సిన అవసరం ఎంట్రప్రెన్యూర్స్‌‌కు ఉండకూడదని బలంగా నమ్మారు. అదే దిశలో ఇన్​కమ్​ట్యాక్స్‌‌, ఎక్సైజ్‌‌, కస్టమ్స్‌‌, ఫారిన్‌‌ డైరెక్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ రూల్స్‌‌ మార్చడంతో పాటు పరిశ్రమలకు ఈజీగా అనుమతులు దొరికేలా చొరవ తీసుకున్నారు. పీవీ ప్రధాని కావడానికి ముందు మన దేశ ఎగుమతులు అంతంతే. విదేశీ మార్కెట్లకు మనం వస్తువులు, సేవలు పంపడం కూడా గ్రోత్‌‌కు ముఖ్యమేనని పీవీ చెప్పేవారు.

సెబీ తెచ్చారు.. ఎన్​ఎస్​ఈ పెట్టారు
కంట్రోలర్‌‌ ఆఫ్‌‌ క్యాపిటల్‌‌ ఇష్యూస్‌‌ (సీసీఐ) రద్దు చేసి సెక్యూరిటీస్‌‌ అండ్‌‌ ఎక్స్చేంజ్‌‌ బోర్డ్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సెబీ) తేవడం, నేషనల్‌‌ స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఈ) ఏర్పాటు చేయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలను 1992లో తమ రెండో బడ్జెట్​లో తీసుకొచ్చారు పీవీ. ఈ రెండు నిర్ణయాలు ఎంత గొప్పవో ఆ తర్వాత కాలంలో అందరికీ అర్థమైంది. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడంలో సెబీ చురుకైన పాత్ర పోషిస్తే ప్రపంచంలోనే మేటి స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌లలో ఒకటిగా ఎన్‌‌ఎస్‌‌ఈ ఎదిగింది. ఆ నిర్ణయాల వల్లే నేడు ఇండియా నుంచి ఎన్నో కంపెనీలు మల్టీ నేషనల్‌‌ స్థాయికి చేరడానికి కారణమయ్యాయి. అయిదేళ్ల పాలనలో దేశ ఎకానమీ ముందుకెళ్లడానికి పీవీ చొరవ తీసుకోని రంగం బహుశా లేదేమో. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకత్వం చేపట్టిన పీవీ.. దేశాన్ని ముందుకి నడిపించిన అద్భుత వ్యక్తి అని ఇప్పటి ప్రధాని మోడీ మెచ్చుకోవడం పీవీ ప్రతిభకు అద్దం పడుతుంది.

ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చారు
అప్పటికే ఆర్బీఐ గవర్నర్‌‌గా అనుభవమున్న మన్మోహన్‌‌సింగ్‌‌.. పీవీ ఆలోచనలను అన్ని విధాలా ముందుకు తీసుకెళడ్లంలో సాయపడ్డారు. మన ఎకానమీ పవర్‌‌ఏంటో ప్రపంచం తెలుసుకునేలా తీర్చిదిద్దుకోవాలనేదే ఇప్పుడు మన ఐడియా అని 1991 బడ్జెట్‌‌ప్రసంగంలో మన్‌‌మోహన్‌‌ చెప్పారు. నెహ్రూ కాలంలో పెద్దపీట వేసిన పబ్లిక్‌‌ రంగ సంస్థలను కొనసాగిస్తూనే ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడాన్ని పీవీ స్టార్ట్చేశారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌‌, టెక్నాలజీ, పరిశ్రమల రంగాల్లో భాగస్వామ్యం తీసుకునేలా ఎంట్రప్రెనూరలో విశ్వాసం పెంచారు.

For More News..

మా ప్రాణం తీసెయ్యండి.. వృద్ధ దంపతుల వేడుకోలు

చైనా బార్డర్‌లో మిస్సైల్ తో ఇండియన్ ఆర్మీ

చైనా ఫోన్లతో మనం పోటీ పడగలమా?

Latest Updates