నెలాఖరుకల్లా పీవీ మెమోరియల్ డిజైన్ ఖరారు

పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె. కేశవరావు
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మెమోరియల్ డిజైన్ ను ఈ నెలాఖరు కల్లా ఖరారు చేస్తామని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ తరహాలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఇదివరకే నిర్ణయించామని, దానికి డిజైన్ ఇచ్చిన ఆర్కిటెక్ నిపుణుడు హైదరాబాద్ కు చెందినవారని తెలిపారు. ఆ ఆర్కిటెక్ పీవీ మెమోరియల్ కోసం అందించిన కొన్ని డిజైన్లను పరిశీలించామని, వాటిలో మార్పులు, చేర్పులు సూచించామన్నారు.

సోమవారం బంజారాహిల్స్ లో కేకే అధ్యక్షతన పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు మంత్రి కేటీఆర్ , ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, కేవీ రమణచారి, పీవీ కుమారుడు రాజేశ్వరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. వారంలోగా మరోసారి సమావేశమవుతామన్నారు. త్వరలో సెమినార్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి పీవీతో పరిచయమున్న, పీవీ ఉన్నప్పుడు పనిచేసిన అప్పటి అమెరికా అధ్యక్షుడు, మలేషియా మాజీ ప్రధాని మతియార్ , ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ ను ఆహ్వానిస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates