పీవీ ఎప్పుడూ మనవాడే: సోనియాగాంధీ

తొలిసారి పొగిడిన సోనియాగాంధీ

డైనమిజంతో సంస్కరణలు తెచ్చారు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

పీవీ సంస్కరణలతోనే దేశం ముందుకు: మాజీ ప్రధాని మన్మోహన్

సంక్షేమానికి పెద్ద పీట వేశారు: చిదంబరం

టీపీసీసీ ఆధ్వర్యంలో పీవీ శత జయంతి వేడుకలు

వీడియో మీటింగ్ లో పాల్గొన్న ప్రముఖులు

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధానమంత్రి, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు పీవీ నర్సింహా రావు ఎల్లప్పుడూ మనవాడేనని, ఆయన దేశానికి, తమకు గర్వకారణమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. పీవీ శత జయంతి వేడుకలను ఏడాదిపాటు కాంగ్రెస్ నిర్వహించుకుంటోందని, పీవీ గురించి ఎవరు ఏ వేడుక చేసినా స్వాగతిస్తా మని చెప్పారు. పీవీ స్ఫూర్తి తో పనిచేసి 2023లో తెలంగాణలో అధికారంలోకి రావాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు గానీ.. ఆ తర్వాత కాలంలో ఎప్పడూ కూడా ఆయన గొప్పతా నన్ని సోనియా పొగిడిన సందర్భాలు లేవు. అయితే మొదటిసారి ఆయన శతజయంతి ఉత్సవాల్లో పీవీ సేవలను పొగిడారు. టీపీసీసీ ఆధ్వర్యంలో పీవీ జయంతి వేడుకలు శుక్రవారం గాంధీభవన్ లో ప్రారంభమయ్యాయి.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ము ఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సిం గ్, సోనియాగాంధీ మెసే జ్ పంపారు. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, జైరాం రమేశ్​తదితరులు లైవ్ వీడియో మీటింగ్ లో ప్రసంగించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీవీ సోదరులు మనోహర్ రావు, పీవీ శత జయంతి కమిట్ చైర్మన్ గీతారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహేశ్‌ గౌడ్, సీనియర్ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అసాధ్యాలను సుసాధ్యం చేశారు

పీవీ గొప్ప సంస్కరణలు తెచ్చారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కొనియాడారు. అత్యంత క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అసాధ్యాలను సుసాధ్యం చేశారన్నారు. ‘పీవీ ప్రధాని అయ్యే నాటికి దేశ విదేశీ మారక నిల్వలు వన్ బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వం లో విదేశీ వ్యవహారాల మంత్రిగా గొప్పగా, నమ్మకంగా పని చేశారు’ అని కొనియాడారు.

బడ్జెట్ పెట్టడం గొప్ప అనుభూతి

పీవీ ఆదర్శవంతమైన వ్యక్తి. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని. పీవీ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టడం గొప్ప అనుభూతి. పీవీ ఆర్థిక సంస్కరణలతోనే దేశం బాగుపడింది.

మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని

ఆర్థిక శాఖ చేయలేదనేవారు

పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన జులై 24 చరిత్రాత్మక దినం. అన్ని మంత్రిత్వ శాఖలు చూశాను గానీ

ఆర్థిక శాఖ చేయలేదని పీవీ సరదాగా చెప్పే వారు. పీవీ సంస్కరణలతో సత్ఫలితాలు వచ్చాయి.

జైరాం రమేష్, కేంద్ర మాజీ మంత్రి

సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు

దేశ అభివృద్ధి ప్రస్థానంలో కీలకమైన ఆర్థిక సంస్కరణల రూపకర్త పీవీ. పీవీ పారిశ్రామిక విధానం గొప్పది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. పీవీతో తనకు ఎంతో అనుబంధం ఉండేది. రాజకీయాల్లో నన్ను ప్రోత్సహించారు. – పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

కార్యకర్త నుంచి ప్రధానిగా..

పీవీ కాం గ్రెస్ లో ఒక సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థా యికి ఎదిగారు. పీవీ చనిపోయే వరకు కాం గ్రెసు వాదిగానే ఉన్నారు. పీవీతో నా కు వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉంది. – ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్

సాధారణ వ్యక్తి ప్రధాని అయ్యారు

పీవీ నర్సింహారావు కండబలం, డబ్బు బలం లేకుం డా ప్రధాని స్థా యికి ఎదిగారు. సామాన్యుడు సైతం ప్రధాని కావొచ్చని పీవీ నిరూపించారు. పీవీకి కాం గ్రెస్ పార్టీ గొప్ప స్థా యిని కల్పించింది. ఇందిరాగాం ధీ పీవీ జీవితానికి వన్నె తెచ్చారు. సోనియాగాం ధీ సలహా మేరకు ఏఐసీసీ ఆమోదంతో పీవీ ప్రధాని అయ్యారు. దక్షిణాది రాష్ట్రా ల నుంచి పీవీకి దక్కిన గౌరవం మరేవరికి దక్కలేదు. – మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Latest Updates