‘ఐ యామ్ బ్యాడ్మింటన్’ కు అంబాసిడర్ గా సింధు

కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)​ నిర్వహిస్తున్న ‘ఐ యామ్ బ్యాడ్మింటన్’ అనే అవేర్ నెస్ క్యాంపెయిన్ కు ఇండియా టాప్ షట్లర్ పీవీ సింధు అంబాసిడర్ గా నియమితురాలైంది. ఈమేరకు సింధును అంబాసిడర్ గా నియమించినట్లు బీడబ్లూఎఫ్ ప్రకటించింది. షట్లర్లకు బ్యాడ్మింటన్ పై గౌరవం పెంచడంతోపాటు గేమ్ ను హానెస్ట్ గా ఆడాలని చెప్పడమే లక్ష్యంగా బీడబ్లూఎఫ్​ఈ క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. ‘బీడబ్లూఎఫ్​ ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ను ప్లేయర్లకు చేరవేసే బాధ్యత అందరు అంబాసిడర్లపై ఉంది. ప్లేయర్లు ఆటను తమ కోసమే ఆడుతున్నారు. దీనిపై వారు సంతోషంగా ఉండాలి. అందుకే గేమ్ ను క్లీన్ గా ఆడాలి’ అని సింధు పేర్కొంది. సింధుతో పాటు అంబాసిడర్స్ గా ఎంపికైన మిచెల్లె లీ (కెనడా), చైనా ద్వయం జెంగ్ సీ–హువాంగ్ యా కియాంగ్, జాక్ షెఫర్డ్ (ఇంగ్లండ్), వాలెస్కా నాబ్ లౌచ్ (జర్మనీ), చాన్ హో యూన్ (హాంకాంగ్), మార్క్ జీబ్లర్ (జర్మనీ) కూడా అథ్లెట్ల కమిషన్ చైర్ లో ఉన్నారు.

Latest Updates