కమలహాసన్‌ ను కలిసిన సింధు

ఇండియన్ టెన్నిస్ స్టార్ పీవీ సింధు… ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత కమలహాసన్ ను కలుసుకుంది. చెన్నైలోని MNM పార్టీ కార్యాలయానికి వెళ్లి కమల్ తో భేటీ అయింది. సింధును కమల్ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆమెతో కలిసి లంచ్ చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ను గెలిచి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందంటూ సింధును ప్రశంసించారు కమల్ .

ఈ సందర్భంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమన్న సింధూ.. దాని కోసం నిత్యం సాధన చేస్తున్నానని తెలిపారు.

అయితే కమల్ హాసన్‌ను సింధు మర్యాదపూర్వకంగానే కలిసిందని, దీని వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని MNM పార్టీ వర్గాలు తెలిపాయి.

Latest Updates