నా పాత్ర లో దీపికను చూడాలని ఉంది: సింధు

తెలుగు తేజం, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధు బ‌యోపిక్ నిర్మించేందుకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే నటుడు సోనూ సూద్ నిర్మాణ హక్కులను చేక్కించుకున్నాడు. ఈ మధ్యే సింధును కలిసిన సోనూ సినిమాకు కావాల్సిన అన్ని అనుమతులు తీసేసుకుని త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు లైన్ క్లియర్ చేసుకున్నాడు. సింధు పాత్ర కోసం అక్కినేని కోడ‌లు స‌మంత‌ని ఫైన‌ల్ చేసార‌నే టాక్ వ‌చ్చింది. పీవీ సింధు బయోపిక్ ను తాను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో కూడా నటించనున్నారు సోనూ.

అయితే లేటెస్ట్ గా సింధు ఇచ్చిన ఇంట‌ర్వూలో త‌న పాత్ర‌లో దీపికా ప‌దుకొణే న‌టించాల‌ని భావిస్తున్నాని తెలిపింది. ఆమె బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌తో పాటు మంచి న‌టి అని చెప్పింది.  అంతేకాదు నా పాత్ర‌లో దీపికాని చూడాల‌ని అనుకుంటున్నానన్న సింధు…ఫైనల్ నిర్ణ‌యం మేక‌ర్స్‌దే అని చెప్పింది.

Latest Updates