ఉత్తరాంధ్ర పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు ఖరారు

విజయనగరం: ఉత్తరాంధ్ర కల్పవల్ల శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర జరిగే తేదీలను అమ్మవారి దేవస్థానం ఖరారు చేసింది. కరోనా నేపధ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసలు ఉత్సవాలు జరుగుతాయా… లేదా.. ?అన్న అనుమానాల నేపధ్యంలో ఉత్సవాలు నిర్వహించడానికే మొగ్గు చూపించారు. అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభం అవుతాయి. అదే రోజు పందిరి రాట కార్యక్రమం మొదలవుతుంది. అక్టోబర్ 22 న అర్ధ మండల దీక్షలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 26 న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం.. 27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమనోత్సవం.. నవంబర్ 3న తెప్పోత్సవం.. నవంబర్ 10 న ఉయ్యాల కాంబల ఉత్సవం.. నవంబరు11 న చండీహోమం జరుగుతుంది. చండీహోమం తో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి.

 

Latest Updates