గుడిలోకి భారీ కొండచిలువ… భయంతో భక్తుల పరుగు

గుడిలోకి భారీ పొడవుగల కొండ చిలువ రావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ దేవాలయంలో జరిగింది. గుడిలోకి వచ్చిన కొండచిలువను చూసిన భక్తులు భయంతో పరుగులు పెట్టారు. అది దాదాపు 10ఫీట్ల పొడవు ఉంది. అప్రమత్తమైన కొందరు భక్తులు పాములు పట్టే వారికి సమాచారం ఇవ్వడంతో…ఆ భారీ కొండచిలువను సంచిలో బంధించారు. దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేయనున్నట్లు తెలిపారు. గుడి చుట్టూ పొదలు, చెట్లు ఉండటంతో కొండచిలువ గుడిలోకి వచ్చి ఉంటుందని అన్నారు.

Latest Updates