కొండ చిలువ చుట్టేసింది: ఆ ఊహ ఎట్లుంటదంటరు..!

ఓ పెద్ద కొండ చిలువ పట్టేసి.. మెడను చుట్టేసిందనుకోండి.. ఆ ఊహే ఎట్లుంటది…

వామ్మో.. ప్రాణం పోదూ అంటరు కదా.

ఓ 58 ఏళ్ల కార్మికుడికి అదే పరిస్థితి ఎదురైంది. కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం జరిగిందీ ఘటన. స్థానికంగా నయ్యర్​ డ్యాం పక్కన ఓ కాలేజీలో కొందరు కార్మికులు క్లీనింగ్​ కార్యక్రమం చేస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడిందో ఏమోగానీ, ఓ పెద్ద కొండ చిలువ భువనచంద్రన్​ నాయర్​ అనే వ్యక్తిపై పడింది. అతడు తేరుకునే లోపు మెడను చుట్టేసింది. విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా అది పట్టు సడలించలేదు. దీంతో తోటి కార్మికులు ఆ కొండ చిలువను లాగేశారు. కొండ చిలువకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా గట్టిగా పట్టి లాగారు. కొండ చిలువ పట్టుకు అతడికి కాసేపటిదాకా ఊపిరందలేదు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అటవీ అధికారులు ఆ కొండ చిలువను దూరంగా అడవుల్లో వదిలేశారు.

Latest Updates