వీడియో వైరల్: జింకను మింగిన పైథాన్

పాములు సాధారణంగా కప్పలు, కుందేళ్లు, ఎలుకల వంటి వాటిని మింగడం సర్వసాధారణం. కానీ, ఒక పాము.. పూర్తి జింకను మింగడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

బర్మీస్ పైథాన్ జాతికి చెందిన పాము ఒక పెద్ద జింకను నానాకష్టాలు పడుతూ మింగింది. పాము నోట్లో జింక పట్టకపోయినా.. పాము మాత్రం తన నోటిని వెడల్పుగా చేస్తూ అతికష్టం మీద మింగింది. పాములు ఇలాంటి పెద్ద జంతువులను మింగితే.. కొన్ని నెలల పాటు ఆహారాన్ని తీసుకోవు. అంతేకాకుండా పాములు మింగిన జంతువులు జీర్ణం అయ్యే వరకు కదలలేని పరిస్థితి ఉంటుంది.

For More News..

ఆన్ లైన్ మ్యారేజ్: ఫోన్ కు తాళి కట్టిన వరుడు.. వీడియో చూడాల్సిందే..

లాక్డౌన్ పాటిస్తే గిఫ్ట్ గా బంగారం, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్

సీసీటీవీ ఫుటేజ్: సిరియాలో బాంబు దాడి.. 40 మంది మృతి

Latest Updates