బాహుబలి తర్వాత అవెంజర్స్ కే ఆ క్రేజ్

ఇటీవలి కాలంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘బాహుబలి’ మాత్రమే. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలుండటంతో మొదటి రోజు షో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. హైదరాబాద్ లో మొదటి రోజు మాత్రమే కాకుండా వీకెండ్ వరకు టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సిటీ సెంటర్లో ఉన్న ఐమాక్స్ దగ్గర ఈ సినిమా విడుదల సమయంలో భారీ క్రేజ్ నెలకొంది. ఆన్ లైన్ లో టిక్కెట్లు లేకపోవడంతో అభిమానులంతా ఐమాక్స్ కు క్యూ కట్టారు. దీంతో కిలో మీటరు వరకు పెద్ద క్యూ ఏర్పడింది. ఇది అప్పట్లో ఓ సంచలనం.

మళ్లీ ఆ తర్వాత ఏ మూవీకి అంతటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు  శుక్రవారం రిలీజ్ అవుతున్న ‘అవెంజర్స్’కు బాహుబలి స్థాయిలో కాకపోయినా ఐమాక్స్ దగ్గర బుధవారం ఉదయం భారీ క్యూనే కనిపించింది. యూత్ కౌంటర్  దగ్గర టికెట్ల కోసం ఉదయం 6 గంటలకే వచ్చి లైన్‌ లో  బారులు తీరారు.

Latest Updates